5 July, 2026 | 1:33 AM

వరంగల్ భద్రకాళి ఆలయంలో ఉద్రిక్తత

05-07-2026 12:00 AM
  1. కుడా ప్రస్తుత, మాజీ చైర్మన్ల తడి బట్ట స్నానాలు, ప్రమాణాలపై బీజేపీ ఆగ్రహం
  2. పసుపు నీళ్లతో ఆలయ వీధుల్లో బీజేపీ నేతల సంప్రోక్షణ 
  3. అడ్డుకుని, అరెస్టు చేసిన పోలీసులు
  4. ఇరువర్గాల మధ్య తోపులాట 
  5. రాజకీయ స్వార్థం కోసం అమ్మవారి ఆలయాన్ని వాడుకోవడం హేయం
  6. బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ 

వరంగల్ (మహబూబాబాద్) జులై 4 (విజయక్రాంతి): కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు వరంగల్ భద్రకాళి అమ్మవారి దేవాలయానికి వచ్చి, తడి బట్ట స్నానాలు చేసి, ప్రమాణాలకు పూనుకోవడంతో ఆలయం అపవిత్రం అయిం దంటూ బీజేపీ నేతలు శనివారం ఆలయ వీధుల్లో సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టడం ఉద్రిక్తతకు దారి తీసింది.

అవినీతికి పాల్పడ్డ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు, ప్రస్తుత కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి తడి బట్ట స్నానాలు చేసి వరంగల్ భద్రకాళి అమ్మవారి దేవాల యం వద్దకు వచ్చి ప్రమాణాలకు పూనుకొని ఆలయాన్ని అపవిత్రం చేశారంటూ ఆలయ వీధుల్లో పసుపు నీళ్లతో సంప్రోక్షణ కార్యక్ర మం చేపట్టారు. పోలీసులు కొందరు బీజేపీ నేతలను ముందస్తుగానే హౌస్‌అరెస్టు చేయ గా, మరికొందరు నేతలు పోలీసుల కళ్లుగప్పి భారీగా తరలివచ్చారు.

పోలీస్ బలగాలు అక్కడికి చేరుకొని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్యతోపులాట జరిగింది. పోలీసులు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకొని మట్టేవాడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సంద ర్భంగా వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంట రవికుమార్, నేతలు మాట్లాడుతూ.. ప్రసిద్ధి గాంచిన భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు వాడుకోవడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు.

తమ రాజకీయ ఉనికి కోసం, ఆరోపణల నుంచి తప్పించుకో వడం కోసం ఆలయ నియమాలను తుంగలో తొక్కి, భక్తులకు తీవ్ర ఇబ్బంది కలిగించడాన్ని బీజేపీ ఖండిస్తోందని తెలిపారు. -కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ప్రస్తుత చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి ఇద్దరూ కలిసి తడిబ ట్టలతో అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించి ప్రమాణాలు చేయడం శాస్త్ర విరుద్ధమన్నారు.