5 July, 2026 | 2:27 AM

రాజ్యాధికార సమరభేరి సభకు సర్వం సిద్ధం

05-07-2026 12:52 AM
  1. లక్షలాది మంది రాకకు భారీ ఏర్పాట్లు
  2. టీఆర్పీ అధ్యక్షుడు మల్లన్న ప్రసంగంపై ఉత్కంఠ

సూర్యాపేట, జూలై 4 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి భువనగిరి వేదికగా మారబోతోంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న ‘రాజ్యాధికార సమరభేరి’ భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. భువ నగిరి బస్టాండ్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం ఈ మహాసభకు ముస్తాబైంది. రాష్ర్టం నలుమూలల నుంచి లక్షలాది మంది బీసీ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అమరవీరుల కుటుంబాలు, మేధావులు, ప్రొఫెసర్లు సామాజిక వర్గాల ప్రతినిధులు తరలివస్తారని అంచనా వేస్తూ పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పూర్తి చేశారు.

సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు కార్యాచరణను పార్టీ నాయకత్వం అమలు చేసింది. భారీ సంఖ్యలో వచ్చే వాహనాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను సిద్ధం చేశా రు. ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా రాకపోక ల మార్గాలను రూపొందించారు. సభా ప్రాం గణంలో తాగునీటి కోసం పెద్ద ఎత్తున వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. వర్షం పడినా సభకు అంతరాయం కలగకుండా విశాలమైన వాటర్‌ప్రూఫ్ టెంట్‌ను ఏర్పాటు చేశా రు. వేలాది మంది ఒకేసారి సభను వీక్షించేలా విశాలమైన, అత్యాధునిక వేదికను నిర్మించి ప్రత్యేకంగా అలంకరించారు. 

సభా ఏర్పాట్లను పార్టీ ముఖ్య నాయకులు ఎప్పటికప్పుడు స్వ యంగా పరిశీలిస్తూ అవసరమైన మార్పులు, సూచనలు చేస్తూ ఏర్పా ట్లను మరింత మెరుగుపరిచారు. ఈ మహాసభలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రసంగం ప్రధాన ఆకర్షణగా నిలవనుందని పార్టీ నాయకులు తెలిపారు. ఈ రాజ్యాధికార సమరభేరి సాధారణ రాజకీయ సభ కాదని, తెలంగాణ రాజ కీయ చరిత్రలో ప్రత్యేక మైలురాయిగా నిలిచే మహాసభ అవుతుందని పార్టీ నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.