15 April, 2026 | 12:50 AM

ధర్యాపూర్ ఉత్తమ ఉపాధ్యాయురాలు చైతన్యను సన్మానించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష

03-01-2026 09:44 PM

ముత్తారం,(విజయక్రాంతి): మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 195వ జన్మదిన పురస్కరించుకొని పెద్దపెల్లి జిల్లాలోని ఉత్తమ మహిళా ఉపాధ్యాయురాలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, కోయ శ్రీహర్ష,  జిల్లా విద్యాధికారి, ముత్తారం మండలం విద్యాధికారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జిల్లా పాలనాధికారి, జిల్లా విద్యాధికారి ఉపాధ్యాయుల కృషిని గౌరవించి, వారి అంకితభావానికి గుర్తింపు ఇవ్వడం లక్ష్యంగా ఏర్పాటు చేశారు. 

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు ఎం.చైతన్య టీజీఎంఎస్ ధర్యాపూర్ ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డును అందుకొని, ఘనంగా సత్కరించబడ్డారు. ఆమె కృషి, అంకితభావం పాఠశాలకు గౌరవాన్ని తీసుకువచ్చిందని, ఈ సందర్భంలో   చైతన్య మేడమ్ ను అభినందిస్తూ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ సంతోష్ కుమార్ కేసరి, ఉపాధ్యాయ బృందం ప్రతినిధులు, టీజీఎంఎస్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.