03-01-2026 09:51:58 PM
ముమ్మరంగా వాహనాల తనిఖీ
మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్
ఎల్లారెడ్డి,(విజయ క్రాంతి): ముమ్మరంగ వాహనాల తనిఖీ, కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి జే శ్రీనివాస్ ఆదేశానుసారం ముమ్మరంగా వాహనాల తనిఖీ నిర్వహించినట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ తెలిపారు. శనివారం ఎల్లారెడ్డి పట్టణంలోని జీవదాన్ హై స్కూల్ పరిసర ప్రాంతంలో పాఠశాల విద్యార్థులను తరలించే ఆటోను తనిఖీలో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా, నడిపిస్తున్న ఆటో యజమానిపై చర్యలు చేపట్టి ఆటోను సీజ్ చేశారు.
ఆటోకు పరిమితికి మించి విద్యార్థులను పాఠశాలకు ప్రమాద స్థాయిలో ఆటోను తోలుతున్నారని పసిపిల్లల ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పైసల కోసం పరిగెత్తుతున్న ఆటో యజమానిపై చర్యలు చేపట్టి కేసు నమోదు చేసినట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలకు పంపే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఆటలలో పంపించేటప్పుడు ఇరికిరిక కాకుండా పరిమితికి మించి పంపకుండా చూసుకోవాలని సూచించారు. వాహనదారులు ఎవరైనా రోడ్డు భద్రత నియమాలను పాటించి రవాణా శాఖకు సహకరించాలని తెలిపారు.