03-01-2026 09:40:10 PM
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జాతీయ గణాంక శాఖ 2026వ సంవత్సరానికి గాను ప్రజల ఉపాధి స్థితిగతులపై పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నిర్వహిస్తున్న సర్వేల్లో భాగంగా వేములవాడ పట్టణంలో గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ సర్వే నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పట్టణాలు గ్రామాలను ఎంపిక చేసుకుని ప్రజల ఉపాధి స్థితిగతులపై సర్వేలో భాగంగా మొదట సాధారణ వివరాలతో సర్వే చేసిన అనంతరం ట్యాబ్ ద్వారా గ్రామంలో కొన్ని కుటుంబాలను ఎంపిక చేసి మూడు నెలల పాటు నెలకు ఒకసారి పూర్తి సర్వే చేసి ప్రత్యేక ట్యాబ్లో వివరాలు నమోదు చేస్తామని గుర్రం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
తొలి విడతలో కుటుంబ యజమాని పేరు సభ్యులు వారి విద్యా అర్హతల గురించి చదువు మానేసిన ఉన్నత చదువులు వృత్తివిద్య కోర్సులు ఉద్యోగం స్వయం ఉపాధి వివరాలు రోజువారి కూలీ అయితే వారంలో ఏ పని చేశారో ఎన్ని గంటలు పని చేశారో ఎంత వేతనం పొందారో వివరాలతో పాటు మహిళలు స్వయం ఉపాధి పొందే వాళ్ళు అయితే వారి ఆదాయ వివరాలను కూడా నమోదు చేసుకుంటామని గుర్రం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.