17 July, 2026 | 1:28 AM

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

03-08-2025 01:08 AM

ముత్తారం  పిహెచ్సి ను ఆకస్మిక తనిఖీ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

ముత్తారం,(విజయక్రాంతి): సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శనివారం  జిల్లా కలెక్టర్ ముత్తారం  పి.హెచ్.సి ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  ల్యాబ్ లో జరుగుతున్న వైద్య పరీక్షల వివరాలను,  స్టాఫ్ అటెండెన్స్ పరిశీలించారు. ఫార్మసీ విభాగంలో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు.  ఆసుపత్రిలో ఎంత మంది ఔట్ పేషెంట్  వస్తున్నారో ఆరా తీశారు.  

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఔట్ పేషంట్ లలో వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని, ముందస్తుగా వ్యాధి నిర్ధారణ జరిగితే మెరుగైన చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలని, సమయ పాలన పాటించాలన్నారు.