03-08-2025 01:05:43 AM
సనత్‌నగర్,(విజయక్రాంతి): అమీర్ పేట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి ని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. శేషుకుమారి శుక్రవారం రాత్రి కొంత అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న జయంతి హాస్పిటల్ లో చేర్పించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం హాస్పిటల్ కు వెళ్ళి ఆమెను పరామర్శించి దైర్యం చెప్పారు. ఆమె ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు వివరించారు.