17 July, 2026 | 1:26 AM

ఐకానిక్ ఇండియా అవార్డుకు ఎంపికైన మీర్ గయాసుద్దీన్

17-07-2026 01:26 AM

చేగుంట జూలై 16: చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన మీర్ గయాసుద్దీన్ కు ట్రీటయుగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రదానం చేసే ప్రతిష్టాత్మక ది ఐకానిక్ ఇండియా అవార్డు 2026 కు వడియారం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త, (టి ఆర్ వి ఎస్ )మెదక్ జిల్లా ప్రెసిడెంట్ మీర్ గియ్యాసుద్దిన్ ఎంపికయ్యారు. జిల్లాలో దివ్యాంగుల సంక్షేమం, సాధికారత కోసం ఆయన చేస్తున్న నిస్వార్థ సేవ, అంకితభావాన్ని గుర్తిస్తూ ఈ అవార్డును ఎంపిక చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

దివ్యాంగుల హక్కులు, సమ్మిళితత్వం, సమాన అవకాశాల కోసం ఆయన చేస్తున్న కృషి, ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోందని అవార్డు ప్రదాన కమిటీ పేర్కొంది.నీతి ఆయోగ్, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఎం ఎస్ ఎం ఈ,మంత్రిత్వ శాఖల గుర్తింపు కలిగిన ట్రీటయుగ్ ఫౌండేషన్, ఆస్తిత్వ ఈవెంట్స్ & మీడియా సంయుక్తంగా ఈ అవార్డును ఎంపిక చేసారు. ఈ సందర్భంగా మీర్ గియ్యాసుద్దిన్ మీడియా తో మాట్లాడుతూ, ఈ అవార్డు, తన బాధ్యతను మరింత పెంచిందని, దివ్యాంగుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.