28 August, 2026 | 1:49 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

'హట్టి గోల్డ్ మైన్స్‌'ను సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

28-08-2026 10:59 AM

ఖమ్మం, (విజయక్రాంతి): రక్షాబంధన్ పండగ రోజున తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కర్ణాటక రాష్ట్రం, రాయచూర్ జిల్లాలోని ‘హట్టి గోల్డ్ మైన్’ను సందర్శించారు. దేశంలోనే ఏకైక ప్రభుత్వ రంగానికి చెందిన ఈ బంగారం ఉత్పత్తి సంస్థలోని ప్రొడక్షన్ యూనిట్, బంగారం శుద్ధి కేంద్రం, ఎలక్ట్రో విన్నింగ్ కేంద్రాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ​ఈ సందర్భంగా మైన్స్ అధికారులు బంగారం తయారీ విధానాన్ని భట్టి విక్రమార్కకి వివరంగా తెలియజేశారు. హట్టి గోల్డ్ మైన్స్ ప్రాజెక్ట్ ద్వారా ప్రతిరోజు సగటున 2 నుంచి 4 కిలోల బంగారం తయారవుతుందని అధికారులు వివరించారు. ​సింగరేణి సంస్థ వేలంలో దక్కించుకున్న 'దేవదుర్గ బంగారం-రాగి ఖనిజ అన్వేషణ బ్లాక్' కూడా ఈ హట్టి గోల్డ్ మైన్స్ సమీపంలోనే ఉండటం గమనార్హం. సందర్శనలో భాగంగా భట్టి విక్రమార్క భూగర్భ గనితో పాటు ఓపెన్ కాస్ట్ గనిని కూడా పరిశీలించారు. ​ఉప ముఖ్యమంత్రి వెంట సింగరేణి సిఎండి బుద్ధ ప్రకాష్ జ్యోతి, ప్లానింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జిఎమ్ పంకజ్ కులశ్రేష్టలతో పాటు ఇతర అధికారులు ఉన్నారు.