28 August, 2026 | 12:04 PM

జంధ్యాల పూర్ణిమ సందర్భంగా సామూహిక యజ్ఞోపవీత ధారణ

28-08-2026 11:02 AM

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ హనుమాన్ ఆలయంలో జంధ్యాల పూర్ణిమ సందర్భంగా సామూహిక యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పండితులు వోజ్జల శిరీష్ శర్మ, వారణాసి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, మంత్రోచ్ఛారణల మధ్య భక్తులు యజ్ఞోపవీతాలను ధరించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో భక్తులు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.