26 June, 2026 | 2:51 AM

ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్

26-06-2026 01:31 AM

సూర్యాపేట, జూన్ 25 (విజయక్రాంతి) : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే ప్రక్రియను సూర్యా పేట మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తుండగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ఇం టి ఇంటికి వెళ్లి నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియ ను పరిశీలించి, ప్రతి ఓటరుకు రెండు ఫారా లు అందజేయడంతో పాటు బీఎల్‌ఓలకు అవసరమైన సమాచారాన్ని స్పష్టంగా తెలియజేయాలని సూచించారు.

ఓటరు వివరా ల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే సంబంధిత బీఎల్‌ఓకు తెలియజేసి సరిచేసుకో వాల న్నారు. అలాగే కావాలని తప్పుడు సమాచారం అందించిన వారి విషయంలో ఫారం లో పొందుపరిచిన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావు, డిప్యూటీ తహసీల్దార్ లాలు, బీఎల్‌ఓ బంగారు పద్మ పాల్గొన్నారు.

డంపింగ్ యార్డులో వ్యర్థాల శుద్ధి ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ 

సూర్యాపేట, జూన్ 25 (విజయక్రాంతి) : బాలెంల గ్రామ పరిధిలోని మున్సిపల్ డంపింగ్ యార్డును జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డులో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఏ విధంగా శుద్ధి చేస్తున్నారో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇటీవల ఏర్పాటు చేసిన బయో మైనింగ్ యంత్రం పనితీరు, దాని ద్వారా తడి, పొడి వ్యర్థాలను ఎలా శుద్ధి చేస్తున్నారనే అంశాల పై అధికారులతో చర్చించారు.

డంపింగ్ యార్డు పరిసరాల్లో పేరుకుపోయిన తడి చెత్తను త్వరగా శుద్ధి చేయాలని, ఎటువంటి చెత్త నిల్వ ఉండకుండా పరిశుభ్రతను నిరంతరం నిర్వహించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి సోమయ్య, శానిటేషన్ ఇన్స్పెక్టర్ యాదగిరి పాల్గొన్నారు.