యువతకు ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం
- స్కిల్ డెవలప్మెంట్ కోసం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు
- ఉద్యోగ కల్పన కోసం జర్మనీ, జపాన్లతో ఒప్పందం
- రంగారెడ్డి గూడలో రూ. 42 కోట్లతో ఏటీసీ ఏర్పాటు
- శంకుస్థాపన చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజాపూర్ జూన్ 25 : యువతకు ఉద్యో గ కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం మండలం లోని రంగారెడ్డి గూడ గ్రామంలో రూ. 42 కోట్ల నిధులతో నిర్మిస్తున్న ఏ టి సి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో యువతకు ఉద్యోగ కల్పనలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు.
రా ష్ట్రంలో ఉన్న 65 ఏటీసీ సెంటర్ల నిర్వహణ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడంతో ఐటిసి సెంటర్లు మూతపడ్డా యన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏటీసీ సెంటర్లను బలోపేతం చేసేందుకు టాటా టెక్నాలజీ తో ఒప్పందం చేసుకొని యువతకు వివిధ రంగాలకు సంబంధించిన ఉపాధి కోర్సులను ఇక్కడ అందించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 2వేల 2 వందల కోట్ల నిధులతో ఇట్ ఇస్ సెంటర్లను అప్ గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపారు.
శిక్షణ పొందిన వారికి టాటా టెక్నాలజీ సంస్థలు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అని అన్నారు. ఇక్కడ శిక్షణ తీసుకుని యువతకు ప్రతి నెల రూ. 2వేలు అందించనున్నట్లు వెల్లడించారు. ఏ టి సి సెంటర్లు వివిధ దేశాలలో కూడా ఉపాధి పొందేందుకు జర్మనీ జపాన్ ఇంగ్లీష్ గ్రీస్ భాషలపై పట్టు సాధించేందుకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. రాబోయే రోజులలో ప్రతి నియోజకవర్గానికి రెండు వేల కోట్ల నిధులతో ఏటిసి సెంటర్లు ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
ఈఏటిసి సెంటర్లలో కొత్త టెక్నాలజీతో వివిధ రంగాలకు సంబంధించిన ఎన్నో రకాల ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయన్నారు. దేశం మొత్తం లో తెలంగాణ రాష్ట్రం ఏ టి సి సెంటర్ల నిర్వహణ బాగుందని కేంద్ర ప్రభుత్వం మనకు తగిన గుర్తింపు ఇచ్చి ఆరు అవార్డులను అందించిందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జడ్చర్ల నియోజకవర్గానికి ఇప్పటికే నవోదయ విద్యాలయం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల, ఏటీసీ సెంటర్లు తీసుకువచ్చినట్లు తెలిపారు. మన నియోజకవర్గ ప్రజలు యువకులు విద్యార్థులకు విద్య ఉపాధి రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఏ టి సి సెంటర్ కు నేను 12 కోట్లు అనుకున్నాని, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో రూ. 42 కోట్లతో రంగారెడ్డి గూడ గ్రామంలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేయడం ఇక్కడ ప్రజలకు శుభ పరిణామమని అన్నారు.
వచ్చేనెల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిడ్జిల్ మండలంలో పర్యటిస్తారని ఆ మండలానికి అవసరమైన నిధులు వనరులు సమకూర్చేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడి హామీ తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రేవతి ఆనంద్, రాష్ట్ర ఎంప్లాయిస్ డైరెక్టర్ క్రాంతి వెస్లీ, జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా, తాసిల్దార్ రాధాకృష్ణ, డిసిసి వైస్ చైర్మన్ యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ అశ్విని, వైస్ చైర్మన్ శేఖర్ గౌడ్, ఉప సర్పంచ్ యాదయ్య, శ్రీనివాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.






