27 June, 2026 | 7:06 PM

Breaking News

జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •  

జిల్లా స్థాయి యువజనోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలి

22-11-2025 01:57 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి,(విజయక్రాంతి): జిల్లాలోని  యువత తమలో దాగి ఉన్న కళను ప్రదర్శించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేందుకు జిల్లా స్థాయి యువజనోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలని  జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శనివారం యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో స్థానిక బాలుర పాఠశాల మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.    జనవరి, 12న జరిగే  స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని గ్రామీణ ప్రాంతాల్లోని యువత కళను వెలికి తీసి ఉత్తమంగా రాణించిన కళాకారులను  రాష్ట్ర, జాతీయ స్థాయిలో పంపించేందుకు నిర్వహిస్తున్న యువజనోత్సవ కార్యక్రమంలో ఫోక్ డ్యాన్స్, చిత్ర లేఖనం, పాటలు, వక్తృవ, ఉపన్యాస పోటీలు తదితర 7 రంగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని అలుపెరగకుండా  సాధన వైపు దూసుకెళ్లాలని సూచించారు.   జిల్లాలోని యువత తమ అత్యుత్తమ  కళా ప్రదర్శన ద్వారా డిసెంబర్ లో జరిగే   రాష్ట్ర స్థాయి,  జనవరి 12న జరిగే జాతీయ స్థాయి యువజనోత్సవ వేడుకల్లో రాణించి వనపర్తి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. స్థానికంగా ఉన్న  ఇండోర్ స్టేడియాన్ని యువత సద్వినియోగం చేసుకొని, శారీరక దృఢత్వంతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అధికారి సుధీర్ రెడ్డి యువజనోత్సవాల ప్రాధాన్యతను యువతకు వివరించారు. జిల్లా విద్యా అధికారి అబ్దుల్ ఘని, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి అంజయ్య, డిప్యూటీ కలెక్టర్ శ్రావ్య, తహసిల్దార్ రమేష్ రెడ్డి, ప్రిన్సిపాల్ ఆనంద్, పి.డి సురేందర్ రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.