calender_icon.png 22 November, 2025 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చివరి గింజ వరకు కొంటాం: పిఎసిఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి

22-11-2025 01:55:13 PM

చేవెళ్ల, విజయక్రాంతి: రైతు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చేవెళ్ల సహకార సంఘం చైర్మన్ దేవర వెంకటరెడ్డి(PACS Chairman Devara Venkata Reddy) స్పష్టం చేశారు. పిఎసిఎస్ ఆధ్వర్యంలో మార్కుఫెడ్ మొక్కజొన్నలను కొనుగోలు చేస్తున్నారు. శనివారం చేవెళ్ల మార్కెట్ యార్డులో  రైతులు ఆరబోసిన మొక్కజొన్న గింజలను, కొనుగోళ్ళను పరిశీలించారు. రైతులతో ముచ్చటించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృతనిచ్చేయంతో పనిచేస్తుందన్నారు.

మొక్కజొన్న క్వింటాలుకు రూ. 2400 మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. తేమశాతం 12 లోపు, ఒక ఎకరా 25 క్వింటాళ్ల వరకు, అలా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని 25 క్వింటాళ్ల మొక్కజొన్నలను తీసుకుంటామన్నారు. వారం రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాలో నగదును జమ చేస్తామన్నారు. ఇప్పటికే 1000 క్వింటాళ్ల వరకు మొక్క జొన్నలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులకు గోనెసంచులు ఉచితంగా ఇస్తున్నామని, లారీలో మొక్కజొన్నలను కొనుగోలు చేసే సందర్భంలో లేబర్ చార్జి తామే భరిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ కార్యదర్శి వెంకటయ్య, సిబ్బంది కృష్ణమూర్తి, రమేష్ రైతులు తదితరులున్నారు.