calender_icon.png 22 November, 2025 | 2:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

22-11-2025 01:59:28 PM

చిట్యాల,(విజయక్రాంతి): ద్విచక్ర వాహనం చెట్టుకు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది.  నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారి 65 పై జరిగిన రోడ్డు ప్రమాదంలో రహదారి పక్కన ఉన్న చెట్టును ద్విచక్ర వాహనం  ఢీకొనగా  నకిరేకంటి కౌశిక్ (20) మిర్యాలగూడ కు చెందిన డిగ్రీ చదువుతున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హైదరాబాదులోని తన అన్న దగ్గర నుండి మిర్యాలగూడ తిరిగి వస్తుండగా తెల్లవారుజామున  ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటన స్థలానికి చిట్యాల పోలీసు వారు చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని అని తెలిపారు.