2 July, 2026 | 12:50 PM

Breaking News

దేవరకద్రలో న్యాయస్థాన భవనం ప్రారంభం   •   కాళేశ్వరం వైఫల్యాలపై హరీశ్ రావు సమాధానం చెప్పాలి: ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు   •   బీఆర్ఎస్ రూ. 7.3 లక్షల కోట్ల అప్పు చేసింది.. కచ్చితంగా నిరూపిస్తా: మంత్రి జూపల్లి   •   వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   హరీశ్ రావు అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •  

వేగంగా ధాన్యం కొనుగోలు జరగాలి

13-05-2026 06:56 PM

* రైస్ మిల్లుల వద్ద ఎలాంటి కోతలు ఉండకూడదు 

* జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

పాపన్నపేట: జిల్లాలో వేగంగా ధాన్యం కొనుగోలు జరగాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం పాపన్నపేట మండలంలోని కుర్తివాడ గ్రామంలోన ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు  కేంద్రాన్ని డీఎస్ఓ, డిఎంసిఎస్ఓతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. స్థానిక హమాలీలను 100 శాతం వినియోగించుకోవాలని, ఎక్కడా హమాలీల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కొనుగోలు కేంద్రాల్లోనే నాణ్యత పరిశీలన అనంతరం రైతులకు వెంటనే రశీదులు ఇవ్వాలని, రైస్ మిల్లుల వద్ద ఎలాంటి కోతలు ఉండకూడదని ఆదేశించారు. పంట రవాణా కోసం ఖాళీగా ఉన్న అన్ని వాహనాలు, ట్రాక్టర్లు, డీసీఎంలను పూర్తిస్థాయిలో వినియోగించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్ కవర్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. తడిసిన ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద, నిర్వాహకులు పాల్గొన్నారు.