6 May, 2026 | 6:16 PM

రామాలయంలో కలెక్టర్ పూజలు

10-12-2024 04:55 PM

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని జనకాపూర్ కోదండ రామాలయం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రె కుటుంబ సమేతంగా శనివారం ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. కలెక్టర్ పెళ్లిరోజును పురస్కరించుకొని పండితులు నిమ్మ కంటి సంతోష్ శర్మ, వోజ్జల శేఖర్ శర్మ, చందావర్ వినాయక శర్మ ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అర్చన చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ దంపతులను శాలువ, మెమెంటోతో సత్కరించి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు సత్యనారాయణ, కార్యదర్శి సిహెచ్ రవి, గౌరవ అధ్యక్షులు డాక్టర్ రమేష్ రూపున ర్, కమిటీ సభ్యులు పర్రే గిరి, గాజర్ల శైలేందర్, చిప్ప మహేష్ తదితరులు పాల్గొన్నారు.