6 May, 2026 | 7:07 PM

గద్దెనెక్కిందుకే బూటకం హామీలు

10-12-2024 05:09 PM

ఎమ్మెల్యే కోవా లక్ష్మి... 

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందుకే రేవంత్ రెడ్డి బూటకపు హామీలు ఇచ్చారని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదురుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా కోవలక్ష్మి మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే నెల రోజుల్లో రెగ్యులర్ చేస్తామని, బేసిక్ పే అమలు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి సమగ్ర శిక్ష ఉద్యోగులను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న కనీసం సమగ్ర శిక్ష ఉద్యోగులను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు, కేజీబీవీ, యు ఆర్ ఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.