25 March, 2026 | 3:02 AM

వందేమాతరం.. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి

25-03-2026 01:40 AM

సామూహిక గీతాలాపనలో కలెక్టర్ రాజర్షిషా వెల్లడి

ఆదిలాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): వందేమాతరం గీతం మన భారతీయతకు, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తికి ప్రతీక అని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ చౌక్ లో డాక్టర్ హెచ్.వి వజే సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వందేమాతరం గీతాపాలన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా  భారత మాత, శ్రీకృష్ణుడు, డాక్టర్ హెచ్.వి వజే చిత్ర పటాలకు పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సామూహికంగా వందేమాతర గీతాన్ని ఆలపించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... వందేమాతరం కేవలం ఒక గీతం మాత్రమే కాదని, అది మన భారతీయతకు, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తికి ప్రతీక అని కొనియాడారు. వికసిత్ భారత్, తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను సాధించే దిశగా అభివృద్ధి బాటలో యువత పయనించలన్నారు.  వచ్చే 25 ఏళ్లలో మన దేశంతో పాటు మన రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా అగ్రగామిగా నిలవాలంటే నేటి విద్యార్థులే కీలకమని, మంచి పౌరులుగా ఎదిగి దేశాభివృద్ధి లో భాగస్వాములు కావాలని యువతకు పిలుపునిచ్చారు.

నేటి కాలంలో విద్యార్థులు మొబైల్ ఫోన్లకు, రీల్స్ కు బానిసలవున్నారని, ఫోన్లను కేవలం ఆన్లైన్ స్టడీ మెటీరియల్ వంటి మంచి పనులకే పరిమితం చేయాలని సూచించారు. అనవసరమైన సామాజిక మాధ్యమాలతో సమయాన్ని వృథా చేసుకోవద్దని, క్రమ శిక్షణతో కూడిన విద్యతో పాటు శారీరక దృఢత్వం కోసం క్రీడలపైనా దృష్టి సారించాలని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్ర మంలో వాజే సమితి అధ్యక్షులు డాక్టర్ ప్రఫు ల్ వాజే, సభ్యులు బండారి దేవన్న, ప్రఫుల్ యాదవ్, బీజేపీ నేతలు సుహాసిని రెడ్డి, వేదా వ్యాస్, పట్టణ ప్రముఖులు దేవిదాస్ దేశ్పాండే, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.