చిల్డ్రన్ పార్క్ అభివృద్ధికి కృషి
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 24(విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని కొట్నాక భీమ్ రావు చిల్డ్రన్స్ పార్క్ అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్ తెలిపారు.మంగళవారం ఆయన పార్కును సందర్శించి అక్కడి సదుపాయాలను పరిశీలించారు.పార్కులో ఏర్పాటు చేసిన స్ప్రింక్లర్ వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేయించారు.
వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో పార్కుకు సందర్శకుల రద్దీ పెరిగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా పార్కులో అన్ని సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.పిల్లలు, కుటుంబ సభ్యులు సంతోషంగా సమయం గడపడానికి పార్కును మరింత అందంగా తీర్చిదిద్దడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మున్సిపాలిటీ కృషి చేస్తుందని పేర్కొన్నారు.




