14 March, 2026 | 10:51 AM

18 నుంచి జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్

15-12-2025 12:43 AM

హనుమకొండ డీఈవో గిరిరాజ్ గౌడ్

హనుమకొండ,డిసెంబర్ 14 (విజయ క్రాంతి): జిల్లాస్థాయిలో నిర్వహించే రాజ్యస్థరీయ బాల వైజ్ఞానిక ప్రదర్శని (డి .ఎల్ .బి .వి .పి.) మరియు 2024 25 సంవత్సరానికి గాను మంజూరైన ఇన్స్పైర్ మనక్ అవార్డుల యొక్క ప్రాజెక్టు ప్రదర్శనల పోటీ(డి.ఎల్. ఈ.పి.సి) లను సంయుక్తంగా ఈనెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధి కారి ఎల్.వి.గిరి రాజ్ గౌడ్ తెలిపారు.

ఇన్స్పైర్ కు సంబంధించి మంజూరైన ప్రతి విద్యార్థిని ప్రదర్శన పోటీకి తప్పనిసరిగా హా జరుపరచుటకై సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పూర్తి బాధ్యత వహించా లనీ, బాల వైజ్ఞానిక ప్రదర్శనికి హాజరయ్యే విద్యార్థులు ముందుగానే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు కూడా రిజిస్ట్రేషన్ కేంద్రంలో రిపోర్టు చేయాలన్నారు.

ప్రతి పాఠశాల నుండి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనడం కోసం ప్రకటించిన ఏడు ఉప ఇతి వృత్తాలలో ఏవేని రెండు ఇతివృత్తాలకు సంబంధించి జూనియర్ విభాగం నుండి ఇద్దరు, సీనియర్ విభాగం నుండి ఇద్దరు విద్యార్థుల చొప్పున పాఠశాల నుండి నలుగురు విద్యార్థులతో 4 ప్రదర్శనాంశాల కు అవకాశం ఉందని,ప్రదర్శనకు హాజరయ్యే విద్యార్థులతో పాటు ప్రతి పాఠశాల నుండి ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ప్రదర్శనలకు విద్యార్థులను తీసుకొని రావాలనీ,

ఒక ప్రదర్శనకు ఒక విద్యార్థికి మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. సైన్స్ ఫెయిర్ ను విజయవంతం చేయడం కోసం వివిధ కమిటీలను ఏర్పాటు చేసి సమన్వయం చేయుటకు గాను తేదీ 15న హనుమకొండలోని సెయింట్ పీటర్ ఎడ్యు స్కూల్ లో ఉదయం 10.00 గంటలకు నిర్వహించే సన్నాహక సమావేశానికి ఆయా కమిటీల కన్వీనర్లు, కొకన్వీనర్లు, మరియు సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు.

అనంతరం జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాస స్వామి మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రదర్శనతో పాటు రిజిస్ట్రేషన్ ఫారం మరియు ప్రదర్శన యొక్క పూర్తి నివేదిక (రైట్ అప్)ను రిజిస్ట్రేషన్ కేంద్రంలో ముందుగానే సమర్పించి గుర్తిం పు కార్డును, ప్రదర్శన పత్రము ను పొంది కేటాయించిన గదిలో ప్రదర్శనను ఏర్పాటు చేసుకోవాలనీ, ఇన్స్పైర్ ప్రదర్శనకు హాజరయ్యే ఫోటోతో కూడిన విద్యార్థులు బోన ఫైడ్ సర్టిఫికెట్, ప్రాజెక్టు/ప్రదర్శన యొక్క సంక్షిప్త నివేదిక మరియు సవివరణ నివేదికలను (రైట్ అప్) రిజిస్ట్రేషన్ కేంద్రంలో సమర్పించాల్సి ఉంటుందన్నారు.

మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలు 18వ తేదీన కార్యక్రమం ఏర్పాట్లతో పాటు, మధ్యాహ్నం 2.00 గంటల నుండి ప్రదర్శనలో పాల్గొని విద్యార్థుల ప్రదర్శనల నమోదు మరియు వారికి కేటాయించిన స్థలంలో ప్రదర్శనల ను అమర్చుకోవడం ఉంటుందనీ,తేదీ 19న ఉదయం 9 గంటల నుండి ప్రదర్శన ప్రారంభమవగా తేదీ 20 న సాయంత్రం 5.00 గంటలకు ప్రదర్శన ముగుస్తుందన్నారు.ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థులు మరియు వారి సహాయక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా వారికి ఇచ్చిన గుర్తింపు కార్డును ధరించి, ప్రదర్శన ఏర్పాటు కోసం తప్పనిసరి సామాగ్రిని వారి వెంట తెచ్చుకోవాల్సి ఉంటుందనీ తెలిపారు.