1 July, 2026 | 2:38 AM

కలెక్టర్ సార్.. టీచర్ అయ్యారు..

01-07-2026 01:51 AM

కేజీబీవీ పాఠశాలలో పాఠాలు బోధించడం కలెక్టర్ 

భైంసా జూన్ 30 (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మంగళవారం లోకేశ్వరం కేజీబీవీ లో టీచర్ గా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఆకస్మిక తనిఖీలో భాగంగా లోకేశ్వరం కేజీబీవీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థుల చదువులపై ఆరా తీశారు.

పదో తరగతి క్లాస్ రూమ్ లోకి వెళ్లిన కలెక్టర్ విద్యార్థులకు బోర్డుపై గణితం ఫిజిక్స్ ఇతర సబ్జెక్టుల ఫార్ములాలు చెప్పి సమాధానం చెప్పించుకున్నారు. బాగా చదువుకోవాలని ఏవైనా అవసరాలు ఉంటే తమ దృష్టికి తేవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం కేజీబీవీ పాఠశాలలో ఉన్న సౌకర్యాలు కల్పించవలసిన సౌకర్యాలపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన తాసిల్దార్ సూర్యారావు అధికారులు ఉన్నారు.