calender_icon.png 26 June, 2025 | 10:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ గారూ.. ఇదేంది సారూ!

26-06-2025 12:29:11 AM

- ఖమ్మం జిల్లాలో అధికారికంగా నోటిఫికేషన్

- భద్రాద్రి జిల్లాలో నోటిఫికేషనే లేకుండా నియామకాలు 

- అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాల్లో భిన్నవైఖరి 

- నిరుద్యోగుల జీవితాలతో ఆటాడుతున్న ఏజెన్సీలు

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 25 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవు ట్సోర్సింగ్ ఏజెన్సీలు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. వీరికి జిల్లా స్థాయి అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆరోపణలు వెలుబ డుతున్నాయి. ఇప్పటికే అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ నిరుద్యోగులను ఎలా దగా చేస్తున్నారు అనే ఘటనలు పలుమార్లు వెలుగుచూశా యి. అయినా, అధికారుల్లో ఎలాంటి సరిదిద్దుకొనే చర్యలు కనిపించిన దాఖలాలు లేవు.

గతంలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి డబ్బులు దండుకున్నారని ఆరోపణ పై పర్ఫెక్ట్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెట్టిన ఘటన మరువక ముందే, బ్లాక్ లిస్టులో ఉన్న ఫర్ఫెక్ట్ ఏజెన్సీని రెన్యువ ల్ చేసిన జిల్లా అధికారుల తీరును ‘విజయక్రాంతి’ గతంలోనే వెలుగులోకి తెచ్చింది. ఆ ఏజెన్సీస్ ద్వారా నియామకమైన ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్త్స్ర బకాయిలు చెల్లించని వైనాన్ని సైతం బహిర్గతం చేసిన విషయం వి ధితమే. ఇంత జరుగుతున్నా అధికారుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. తాజా గా మైనారిటీ పాఠశాల, కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్ను అధికారులు విడుదల చేయకుండా, సాయిరాం ఏజెన్సీస్ ద్వా రా నోటిఫికేషన్ జారీచేయించడం గమనార్హం . 

కార్యాలయమే లేని ఏజెన్సీ

ప్రస్తుతం మైనారిటీ పాఠశాల, కాలేజీలో నియామకాలు చేపట్టిన సాయిరాం ఔట్సోర్సింగ్ ఏజెన్సీస్కి జిల్లాలో పర్మినెంట్ కార్యా లయం లేకపోవడం గమనార్హం. ఏజెన్సీ ని ర్వాహకులు ఏకంగా రోడ్డుపైనే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయాన్ని ‘విజయక్రాంతి’ వెలుగులోకి తెచ్చింది. వాస్తవంగా ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ఒక ఏడాదే కా లపరిమితి కలిగి ఉంటుంది.

గతంలో కలెక్టర్గా పనిచేసిన అనుదీప్ హయాంలో సాయి రాం ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి అనుమతులు ఇచ్చారు. సుమారు మూడేళ్లుగా అదే లేఖపై ఈ ఏజెన్సీ కొనసాగడం గమనార్హం. అది నిబంధనలకు విరుద్ధమే, అంతేకాకుండా జి ల్లా స్థాయి అధికారులు అవుట్సోర్సింగ్ ఏజె న్సీ తెలిపిన అడ్రస్ను తనిఖీ చేసిన అనంతరమే నోటిఫికేషను విడుదల చేయాల్సి ఉం ది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అందుకు విరుద్ధంగా అధికారులు వ్యవహరించారు. 

ఖమ్మంలో ఒకలా.. భద్రాద్రిలో ఇలా

పోరుగున ఉన్న ఖమ్మం జిల్లాలో మైనారిటీ పాఠశాల, కళాశాలలో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు ఆ జిల్లా కలెక్టర్ వినాయక అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్కి అనుమతి ఇచ్చా రు. అభ్యర్థులు వారి దరఖాస్తులను ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రీజనల్ కోఆర్డినేటర్ కార్యాలయంలో సమర్పించాలని నోటిఫికేషన్ అధికారికంగా జారీచేశారు. ఓకే శాఖలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీస్ విధానం లో భిన్న వైఖరిపై భద్రాద్రి కొత్తగూడెం జి ల్లాలో అభ్యర్థులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం నోటిఫికే షన్ ఇచ్చి, భద్రాద్రి జిల్లాలో ఏజెన్సీ సంస్థ నోటిఫికేషన్ ఇవ్వబం ఏంటని అభ్యర్థులు ప్ర శ్నిస్తున్నారు. పోస్టులు దొడ్డిదారిలో అమ్ముకొని తూతూమంత్రంగా దరఖాస్తులు స్వీక రించారని ఆరోపిస్తున్నారు. ఇకనైనా భద్రా ద్రి కలెక్టర్ కల్పించుకొని సదరు ఔట్సోర్సింగ్ ఏజెన్సీని రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నా రు. కొత్త నోటిఫికేషన్ జారీచేస్తూ అధికారికంగా ప్రకటన చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.