నాంపల్లి ఈడీ కోర్టుకు మాజీ మంత్రి కారుమూరి
హైదరాబాద్: ఏపీ మద్యం రవాణా కుంభకోణం(AP liquor case) కేసులో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును(Karumuri Venkata Nageswara Rao) నాంపల్లి ఈడీ కోర్టుకు తరలించారు. ముందస్తు అరెస్టును ఊహించి కారుమూరి నాగేశ్వరరావు మిత్రుడి ఇంట్లో తలదాచుకున్నారు. మజీద్ బండ్ లోని షార్క్ హైట్స్ అపార్ట్ మెంట్ లో ఈడీ అధికారులు మాజీ మంత్రిని అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం బషీర్ బాగ్ ఈడీ కార్యాలయానికి తరలించారు.
ఇదే కేసులో ఇప్పటికే కారుమూరి కుమారుడు సునీల్ కుమార్, వాసుదేవరెడ్డి, రాజ్ కెసిరెడ్డిని ఈడీ అధికారులు(ED officials) అరెస్టు చేశారు. మద్యం రవాణా కాంట్రాక్టులో భారీగా అక్రమాలు జరిగినట్లు ఈడీ ఆరోపించింది. రవాణా ధరను కిలో మీటర్ కు 13 నుంచి 35కు పెంచినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. సుమారు రూ. 195.33 కోట్ల మేర అబ్ధి పొందినట్లు ఆరోపణలున్నాయి. సునీల్ కుమార్ ఇంట్లో రోలెక్స్ వాచీలు, రేంజ్ రోవర్ స్వాధీనం చేసుకున్నారు. హవాలా లావాదేవీల్లో కారుమూరికి రూ. 15 కోట్లు చేరినట్లు సమాచారం. కారుమూరికి సంబంధించిన రూ. 87.7 కోట్ల ఆస్తులను ఇప్పటికే ఈడీ జప్తు చేసింది.






