24 August, 2026 | 1:06 PM

బీజేపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష

24-08-2026 12:04 PM

ముకరంపుర, ఆగస్టు 24 (విజయ క్రాంతి): భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు సాయిని మల్లేశం ఆధ్వర్యంలో కళాభారతి ప్రక్కన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా శాఖ అధ్యక్షులు మాట్లాడుతూ.. మంగళవారం హైదరాబాదులో రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు చేపట్టనున్న రెండు రోజుల నిరాహార దీక్షకు మద్దతుగా సోమవారం కరీంనగర్లో నిరసన దీక్ష చేపడుతున్నామని.. గత మూడు రోజుల క్రితం బీజేవైఎం ఆధ్వర్యంలో ఫీజుల బకాయి బిజెపి లడాయి పేరుతో కార్యక్రమం నిర్వహించామని.. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లభించలేదని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజుల బకాయి విషయంలో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని వెంటనే ఫీజుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లో జరిగే నిరాహార దీక్ష కార్యక్రమానికి కరీంనగర్ నుండి వేలాది మంది విద్యార్థులు తరలి వెళ్లనున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వొంటెల సత్యనారాయణ రెడ్డి, సౌగాని కొమరయ్య, చొప్పరి జయశ్రీ, కో ఆప్షన్ మెంబర్ కన్న కృష్ణ, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు.