24 August, 2026 | 12:42 PM

కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం

24-08-2026 11:40 AM

హైదరాబాద్ ఆగస్టు24(విజయక్రాంతి): కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది. హైదరాబాద్ జలసౌధలో తెలంగాణ–ఏపీ ఈఎన్‌సీలతో త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఈ ప్రమాశంలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో కలిపి వినియోగానికి అందుబాటులో ఉన్న నీరు సుమారు 146 టీఎంసీలుగా పేర్కొంటూ, ఏపీ 70 శాతం అంటే 115.70 టీఎంసీలు, తెలంగాణకు 30 శాతం (30.85 టీఎంసీలు) ఇవ్వాలని కోరినట్లు నివేదికలు చెబుతున్నాయి.

  • తెలంగాణ మాత్రం బేసిన్ ప్రాతిపదికన 71:29 నిష్పత్తి కోరుతోంది. ప్రస్తుతం ఉన్న నీటిలో ఏపీకి వాటా లేదని, ఉమ్మడి జలాశయాల్లో తాగునీటి అవసరాల కోసం నీటిని కాపాడాల్సిన అవసరం ఉందని తెలంగాణ వాదిస్తోంది. అలాగే 2027 ఆగస్టు వరకు కృష్ణా బేసిన్‌లో 50 టీఎంసీలు అవసరమని, అందులో శ్రీశైలం నుంచి 10, నాగార్జునసాగర్ నుంచి 40 టీఎంసీలు కావాలని కోరినట్లు నివేదికలు ఉన్నాయి. ఏపీ 70:30 నిష్పత్తిలో నీటి పంపిణీ చేయాలని కోరుతూ, అక్టోబర్ 31 వరకు తాగునీటి అవసరాల కోసం 47 టీఎంసీలు కేటాయించాలని కేఆర్‌ఎంబీని కోరుతోంది. తమకు లభించే 115.70 టీఎంసీలలోనే ఈ 47 టీఎంసీలు ఇవ్వాలని ఏపీ వాదనగా ఉంది. అందువల్ల త్రిసభ్య కమిటీ భేటీ రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉత్కంఠకు కారణమైంది.