24 August, 2026 | 12:40 PM

ఐటిడిఏ ముట్టడికి భారీ బందోబస్తు

24-08-2026 12:09 PM

పొట్లూరు మండల కేంద్రంలో సంపూర్ణ బంద్

ఉట్నూర్, ఆగస్ట్ 24( విజయక్రాంతి ): ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలని, ఏజెన్సీ ఏరియాలో 1/70 యాక్ట్ అమలు చేయాలని ప్రత్యేక డిమాండ్లతో ఆదివాసులు చేపట్టిన ఐటిడిఏ ముట్టడి  కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం ఉట్నూర్ ఏఎస్పి రిత్విక్ సాయి కొట్టే ఆధ్వర్యంలో  అవుట్డోర్ సీఐ మాడవి ప్రసాద్ పర్యవేక్షణలో పోలీసులు ఉదయం నుండి ఐటీడీఏ మార్గానికి వెళ్లే  రహదారులపై పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని గిరిజన కార్పొరేషన్ పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు ఐటీడీఏ మార్గానికి వెళ్లకుండా బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు అక్కడే బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించకుండా పోలీసులు ఏర్పాటు చేశారు. ఐటిడిఏ ముట్టడి కార్యక్రమం సందర్భంగా ఉట్నూర్ పట్టణ కేంద్రంలో  వ్యాపారులు వ్యాపార సంస్థలను మూసివేశారు.ఐటిడిఏ కార్యాలయం ముట్టడికి ఆదివాసులు తరలిరాకముందే బందోబస్తు  ఏర్పాటు చేయడంతో  సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగాయి. ఐటిడిఏ కార్యాలయానికి  వెళ్లే మార్గంలో  పోలీసుల బందోబస్తుతో ఐటిడిఏ వైపు  ప్రజలు వెళ్లేందుకు సాహసించలేదు.