14-01-2026 02:34:21 AM
కరీంనగర్, జనవరి13(విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలపై ఆ ఇద్దరు అధికారులు నమ్మకం పెంచారు. గతంలో కరింనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి సర్జరీ చేయించుకోగా తా జాగా కరింనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపూల్ దేశాయి తన సతీమణి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం నిమిత్తం చేర్చి ఆదర్శంగా నిలిచారు. నిజానికి ఐ ఏ ఎస్, ఐ పి ఎస్ అధికారులు కార్పొరేట్ వైద్యం పై మ క్కువ చూపుతారు జిల్లా అధికారులు ప్రభు త్వ వైద్యం చేయించుకొని శభాష్ అనిపించుకున్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వాసుప త్రులపై నమ్మకం రోజురోజుకు పెరుగుతున్నది. ఐఏఎస్ అధికారులు వారి కుటుంబ సభ్యులు సాధారణ ప్రజలు అత్యుత్తమ సేవలను ప్రభుత్వాసుపత్రిలో పొందుతున్నారు.
ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో సేవలందించడంతో రోజురోజుకు ప్రభుత్వ ఆస్పత్రి సే వలపై పాజిటివ్ దృక్పథం పెరిగిపోతున్నది. ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రులకే ప్రాధాన్యమి స్తున్నారు. ఇందుకు విశేషం ఏమిటంటే కరీంనగర్ నగర పాలక సంస్థ కమిషనర్ ఐఏఎస్ అధికారి ప్రఫుల్ దేశాయ్ సతీమణి ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి మాత శిశు కేంద్రంలో పండంటి పాపకు జన్మనిచ్చింది. మున్సిపల్ కమిషనర్ దంపతులు ఆదర్శంగా నిలిచారు. వారిని జిల్లా కలెక్టర్ ప మేలా సత్పతి ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి వై ద్యాధికారులు సిబ్బంది అభినందించారు.
గర్భవతి అయిన మున్సిపల్ కమిషనర్ సతీమణినీ కమిషనర్ ప్రఫులు దేశాయ్ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చే యిం చారు. ఉమ్మనీరు తగ్గడంతో ప్రభుత్వ ప్రధానాస్పత్రి మాత శిశు కేంద్రంలో చేర్పించారు. సోమవారం గైనకాలజిస్టుల పర్యవేక్షణలో ఆమెకు ఆపరేషన్ చేశారు. అనుభవజ్ఞులైన గైనకాలజిస్ట్లు నిపుణులైన వైద్య బృందం న ర్సింగ్ సిబ్బంది సమన్వయంతో డెలివరీని విజయవంతంగా నిర్వహించారు. దీంతో మున్సిపల్ కమిషనర్ సతీమణి పం డంటి పాపకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ప్ర స్తుతం క్షేమంగా ఉన్నారు. ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
హెచ్ ఓ డి గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మజ గైనకాలజిస్టులు డాక్టర్ దీప సంగీత సుహాసిని పి ల్లల వైద్య నిపుణులు వేణు మల్లికార్జున్ అనస్థీసియా హెచ్ ఓ డి డాక్టర్ శంతన్, సంగీత న ర్సింగ్ సూపరిండెంట్ సరిత పద్మశ్రీ రమ వైద్య సేవలు అందించారు.కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయి మాత్రం గర్భవతి అయిన తన సతీమణినీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం విశేషం. ఈ పరిణామం తెలంగాణ ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజల్లోనే కాకుండా, ఉన్నతాధికారుల్లోనూ విశ్వాసం పెరుగుతోంది. ప్రభుత్వ వైద్య వ్యవస్థ బలోపేతానికి ఇది మరో సానుకూల సంకేతంగా నిలుస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పై ఉన్న అపోహలు తొలగి సామాన్య ప్రజలు మరింత ధైర్యంగా వైద్య సేవలను వినియోగించుకునే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మున్సిపల్ కమిషనర్ దంపతులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆస్పత్రి సూపరిండెంట్ వీరారెడ్డి ఆర్‌ఎంఓ నవీనా వైద్య అధికారులు తదితరులు అభినందనలు తెలిపారు.
శస్త్ర చికిత్స చేయించుకున్న కలెక్టర్
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రభుత్వాసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని ఆదర్శంగా నిలిచారు. కొన్నేళ్లుగా సైనసై ట్సీతో ఇబ్బంది పడుతున్న ఆమెబిగత ఏడు జూన్ నెలలో జిల్లా జనరల్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. వారు పరీక్షల అనంత రం శస్త్ర చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఈఎన్టీ వైద్యులు డాక్టర్ రవికాంత్ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కలెక్టర్ను ప్రశంసించారు.ప్రభుత్వాసుపత్రుల్లో ఆధునిక సదుపా యాలతో పాటు అనుభవమున్న వైద్యసిబ్బంది ఉన్నారని, శస్త్రచికిత్స చేయించుకుని ప్రజల్లో ప్రభుత్వాసుపత్రులపై నమ్మకాన్ని పెంచారని సీఎం రేవంత్ ‘ఎక్స్’ వేదికగా అభినందించారుకూడా.