14-01-2026 02:31:30 AM
ట్రస్ట్ సేవలు స్ఫూర్తిదాయకం.. ముగ్గుల పోటీల్లో ప్రతిభా మూర్తులకు విప్ ఆది శ్రీనివాస్ అభినందనలు
వేములవాడ, జనవరి 13 (విజయక్రాంతి): వేములవాడ పట్టణంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మంగళవా రం పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు కనువిందు చేశాయి. ఆల్ఫోర్స్ వి ద్యాసంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి వీఎన్‌ఆర్. ఫౌండేషన్ అందించిన ఆర్థిక సహకా రంతో జరిగిన ఈ పోటీల్లో సుమారు 40 మందికి పైగా మహిళలు ఉత్సాహంగా పా ల్గొని, తమ ప్రతిభతో రంగురంగుల ముగ్గులను తీర్చిదిద్ది భారతీయ సంస్కృతిని చాటిచెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్ర భుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముగ్గులు సం క్రాంతి పండుగకు ప్రతీకలని, ముగ్గుల ద్వా రా గృహాలకు లక్ష్మీకళతో పాటు భోగభాగ్యా లు సిద్దిస్తాయని పేర్కొన్నారు. కరోనా కష్టకాలం నుండి నేటి వరకు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ అలుపెరగకుండా చేస్తున్న అన్నదాన సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. అనంతరం ఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడు తూ . మహిళలు ముగ్గుల ద్వారా దేశానికి స్ఫూర్తినిచ్చే నినాదాలను ప్రదర్శించడం గొ ప్ప విషయమ న్నారు. ట్రస్ట్ చేసే సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పు డూ ఉంటుందని హామీ ఇచ్చారు.పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు అతిథుల చే తుల మీదుగా బహుమతులు అందజేశారు.
ప్రథమ బహుమతి సాధించిన గుగ్గిళ్ల స్వప్న, ద్వితీయ విజేత చిరంజి సునీత, తృతీయ విజేత చీకటమల్ల రజితలకు పట్టుచీరలను బహూకరించారు. నాలుగో బహుమతి పిల్లి లావణ్య, ఐదో బహుమతి మంచాల మాధవికి వెయ్యి రూ పాయల విలువైన చీరలను అందజేశారు. పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు కన్సోలేషన్ బహుమతులు అందజేసి ప్రోత్సహిం చారు. న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి న ద్వారక శ్రీదేవి, వజ్జల పద్మజ, పొలాస స్వప్నలకు కూడా జ్ఞాపికలను అందజేశారు. ఈ వేడుకలో రాజన్న ఆలయ ఈఓ రమాదేవి, ఆర్యవైశ్య నాయకులు కట్కూరి శ్రీనివాస్, ట్రస్ట్ నిర్వాహకులు మధు మ హేష్, పాత సంతోష్, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, డాక్టర్. బెజ్జంకి రవీందర్, సగ్గు రాహు ల్, పసుల శ్రీనివాస్, ప్రతాప నటరాజు, కొప్పుల హనుమాండ్లు, తోట రాజు, మార్కె ట్ కమిటీ చైర్మ న్ రొండి రాజు, విఎన్‌ఆర్ ఫౌండేషన్ కన్వీనర్ మాధవ్ రాజు, చిన్నారి పాత సహస్ర పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.