12-08-2025 12:26:14 AM
కరీంనగర్ క్రైం, ఆగస్టు 11 (విజయ క్రాంతి): జిల్లా పాలనా యంత్రాంగం, పారమిత విద్యాసంస్థల సంయుక్త ఆద్వర్యంలో నిర్వహించనున్న జిల్లా స్థాయి చేతివ్రాత పో టీల పోస్టర్ ను సోమవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగాపారమిత విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఇ.ప్రసాద రావు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాస్థాయి చేతివ్రాత పోటీలను ప్రభుత్వ విద్యార్థులకు, ప్రభుత్వ అధికారులకు, ఉపాధ్యాయులకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
చేతివ్రాతకు పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థు లకు (6 నుండి 10 తరగతులు) మరియు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయుల విడివిడిగా చేతివ్రాత పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 20న విద్యార్థులకు పాఠశాల స్థాయి పోటీ ఉద యం 10 నుండి 10.45 గంటల వరకు, 25 నా మండల స్థాయి పోటీ ఉదయం 10 నుం డి 10.45 గంటల వరకు,
సెప్టెంబర్ 7న వి ద్యార్థులకు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు జి ల్లా స్థాయి పోటీ ఉదయం 10 నుండి 10. 45 గంటల వరకు పద్మ నగర్ లోని పారమిత హెరిటేజ్ పాఠశాలలో నిర్వహించను న్నట్లు తెలిపారు. విజేతలకు నగదు బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదా నం చేయనున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొని విజయవంతంచేయాలనికోరారు.