12-08-2025 12:23:48 AM
పాత కాంట్రాక్టు విధానాన్ని కొనసాగించాలి కామారెడ్డి జిల్లా గురుకుల కాంట్రాక్టర్ల మొర ప్రభుత్వం స్పందించకుంటే 13 నుంచి గురుకులాలకు సరఫరా నిలిపివేస్తాం కొత్త విధానంతో 800 కుటుంబాలు రోడ్డు పాలు
కామారెడ్డి, ఆగస్టు 11 (విజయక్రాంతి) ప్రభుత్వం అనాలోచిత విధానాల వల్ల తాము రోడ్డున పడడంతో పాటు తమ కుటుంబాలు రోడ్డున పడతాయని గురుకులాలకు వెజిటేబుల్స్, ప్రొవిజన్స్ సరఫరా చేసే కాంట్రాక్టర్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 800 మంది చిరు కాంట్రాక్టర్లు గురుకుల పాఠశాలలకు పండ్లు, కూరగాయలు, కిరాణా వస్తువులు, కోడిగుడ్లు, ఇతర వస్తువుల సరఫరా కోసం ఒక్కొక్క విభాగానికి జిల్లా వ్యాప్తంగా 47 మంది చిరు కాంట్రాక్టర్లు టెండర్ వేసి గురుకులాలకు సరఫరా చేసేందుకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి టెండర్ ద్వారా పనులను దక్కించుకుంటారు.
నెలకు సరిపడా వస్తువులను సరఫరా చేస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లులను పొందుతూ గత 20 సంవత్సరాలుగా పనులు చేస్తున్న చిరు కాంట్రాక్టర్లపై ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త కాంట్రాక్టు విధానం తమ పనులకు వీగాతం కలగడమే కాకుండా తమ పనులు పోవడమే కాకుండా రోడ్డుపై వస్తామని వాపోతు న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కాంట్రాక్టు విధానాన్ని గురుకుల పాఠశాలలకు సరఫరా చేసే వివిధ రకాల వస్తువులపై కోట్ల రూపాయలు డిపాజిట్ కట్టాలంటూ కొత్త విధానం అమల్లోకి తెస్తే తమలాంటి చిరు కాంట్రాక్టు పనులు చేసే వారికి డబ్బులు లేక తమ పనులు కోల్పోవాల్సి వస్తుందని అంటున్నారు.
ఈ విధానం వల్ల కేవలం కామారెడ్డి జిల్లాలోని ఎనిమిది వందల మంది చిరు కాంట్రాక్టర్లు పనులు కోల్పోవాల్సి వస్తుందని, అమ్మతోపాటు తమ చేతి కింద పనిచేసే మరో 1600 మంది ఉపాధి కోల్పోతారని తెలిపారు. ప్రభుత్వం కొత్త విధానాన్ని రద్దుచేసి పాత విధానంలో కాంట్రాక్టు ఇవ్వాలని కోరుతున్నారు. లేకుంటే తమతో పాటు తమ కుటుంబాలు తమతో పని చేసే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని తెలిపారు. ప్రభుత్వం తమ కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని పాత కాంట్రాక్టు విధానాన్ని అమలుపరచాలని కోరుతున్నారు. రాష్ర్టవ్యాప్తంగా 15 వేల పైగా చిరు కాంట్రాక్టర్లు ఉపాధి కోల్పోతారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి పాత కాంట్రాక్టు విధానాన్ని గురుకుల పాఠశాలలో కొనసాగించాలని కోరుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి, మంత్రుల దృష్టికి తమ రాష్ర్ట ప్రతినిధులు ఇప్పటికే వివరించారని తెలిపారు. ఇప్పటికే కోడిగుడ్లు సరఫరా చేసే టెండర్లను జిల్లాకు ఒకరికి అప్పగించారని దీంతో 47 మంది కాంట్రాక్టర్లు ఉపాధి కోల్పోయారన్నారు. అంతేకాకుండా ఒక కోడి గుడ్డుకు రెండు రూపాయలు అదనంగా రేటు పెంచడం వల్ల కామారెడ్డి జిల్లాలోని రోజుకు రెండు లక్షల నష్టం ప్రభుత్వం పై భారం పడుతుందన్నారు. ఇలాంటి అనాలోచిత విధానాల కు ప్రభుత్వం స్వస్తి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేట్ కాంట్రాక్టు విధానానికి అప్పగించాలని చూస్తున్న ప్రభుత్వం తమ కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్ కాంట్రాక్టు విధానానికి స్వస్తి పలకాలని కోరుతున్నారు.
కార్పొరేట్ కాంట్రాక్టు విధానం వల్ల ఒక కంపెనీ గుత్తాధిపత్యం లోకి గురుకుల పాఠశాలలకు వస్తువుల సరఫరా, కూరగాయల సరఫరా, మటన్, చికెన్, సరపర, కిరాణా వస్తువుల సరఫరా వెళ్లడం వల్ల ఒక్కొక్క విభాగానికి 47 అంది కాంట్రాక్టర్లు చిరు వ్యాపారులు లబ్ధి పొందుతున్నారని వారితో పాటు మరో అదనంగా ఒక్కొక్క కాంట్రాక్టు కింద ఇద్దరు చొప్పున అదనంగా ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే ఈనెల 13 నుంచి గురుకుల పాఠశాలలకు సరఫరా చేసే వస్తువులను నిలిపివేసి నిర వదికంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమ ను రోడ్డు పాలు చేయవద్దని కోరుతున్నారు.
ఉపాధి కోల్పోతాం..
ప్రభుత్వం అనాలోచిత విధానాలకు స్వస్తి చెప్పి తమ కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాత కాంట్రాక్టు విధానాన్ని కొనసాగించాలి.. కొత్త కాంట్రాక్టు విధానం వల్ల కోట్ల రూపాయల డిపాజిట్ చేసే ఆర్థిక స్తోమత మా వద్దకు లేదు. మా కుటుంబాలు, మేము రోడ్డున పడతాం.
యాసిన్, జిల్లా ప్రధాన కార్యదర్శి, కామారెడ్డి
పాత విధానాన్నే కొనసాగించాలి..
రాష్ర్టవ్యాప్తంగా గురుకుల పాఠశాలలకు చిరు కాంట్రా క్టర్లు సరఫరా చేస్తు న్న కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయవద్దని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఎన్నో వేల కుటుంబాలు రోడ్డున పడతాయి. ప్రభుత్వం పునరాలోచించి కొత్త విధానాన్ని రద్దుచేసి పాత విధానాన్ని కొనసాగించాలి.
కృష్ణారెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు