31 March, 2026 | 8:37 PM

అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించిన కలెక్టర్

07-12-2024 12:34 PM

భద్రాద్రికొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని పాత కొత్తగూడెం మండల రిసోర్స్ కేంద్రం కొత్తగూడెం ఆవరణలో నిర్వహించబడుతున్న అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ జితేష్.వి.పాటిల్ శనివారం సందర్శించారు. గతంలో సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు కలెక్టర్ శ్రీకారం చుట్టారు. ఆ మేరకు నేడు సోలార్ హీటర్లను నేడు ప్రారంభించి, వాటి పనితీరును పరిశీలించారు. తరగతి గదిలో బోధనను పరిశీలించి, విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. పాఠశాల పట్ల ప్రత్యేక శ్రద్ధను కనపరచాలని నిర్వాహకులను కోరారు. కలెక్టర్ వెంట మండల విద్యాశాఖ అధికారి డా, ప్రభు దయాల్ అకాడమిక్ జిల్లా కోఆర్డినేటర్ నాగరాజశేఖర్ లు పాల్గొన్నారు.