31 March, 2026 | 7:08 PM

వందేళ్ళ చరిత్ర కలిగిన నిజాంసాగర్‌కు పూర్వ వైభవం తీసుకువస్తాం

07-12-2024 12:31 PM

రాష్ట్ర టూరిజం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

కామారెడ్డి, (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు పూర్వవైభవం తీసుకువస్తామని రాష్ట్ర టూరిజం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా మదునూరులో సమీకృత గురుకుల భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. వందేళ్ల చరిత్ర కలిగిన నిజాంసాగర్ ప్రాజెక్టు ను పర్యాటక కేంద్రంగా పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. టూరిజం ప్రమోషన్ లో భాగంగా నిజాంసాగర్ ప్రాజెక్టు సందర్శించినట్లు తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద ప్రాచీన కట్టడాలైన గోల్డ్ బంగ్లా గుల్బర్గా బంగ్లా విఐపి గార్డెన్ స్విమ్మింగ్ ఫుల్ తదితర  కట్టడాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తో కలిసి పరిశీలించారు. పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను సంబంధిత అధికారులతో చర్చించారు.

నిజాంసాగర్ జలాశయం తో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి 12 ఎకరాల స్థలాన్ని పర్యాటక అభివృద్ధి సంస్థకు రెవిన్యూ శాఖ అప్పగించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ప్రాజెక్టు సందర్శనకు వచ్చే పర్యాటకు జలాశయంలో ఆహ్లాదం కోసం బోటింగ్ జలాశయం దిగువన కాటేజీలు ఉద్యానవనం చిన్నపిల్లల పార్కు తదితర సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు. అనంతరం నిజాంసాగర్ హైడ్రో పవర్ స్టేషన్ ను పరిశీలించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల వరప్రదాయని ఆయన నిజాంసాగర్ ప్రాజెక్టు పర్యాటక ప్రదేశాలు అద్భుతంగా ఉందని అన్నారు గడిచిన చెక్కుచెదరలేదని తెలిపారు మూడు కాలాలు ఎప్పుడు నిండుకుండలా ఉన్న నిజాంసాగర్ జలాశయం పర్యాటక అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పిపిపి ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు త్వరలోనే నూతన పర్యాటక పాలసీ అమల్లోకి తేస్తామని వెల్లడించారు. నిజాంసాగర్ ఐబ్రో పవర్ స్టేషన్లో 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు త్వరలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో చర్చించి నిజాంసాగర్ ప్రాజెక్టును పూర్తిగా ఆధునికరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అసిస్ సంఘవన్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, సబ్ కలెక్టర్ కిరణ్మయి, బిచ్కుంద మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోద్ కుమార్, నీటిపారుదల శాఖ అధికారులు, పర్యటకశాఖ అధికారులతో పాటు తదితరులు పాల్గొన్నారు.