calender_icon.png 18 July, 2025 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన చట్టాలను హరిస్తే సహించం

18-07-2025 12:00:00 AM

తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లెం కోటి 

మణుగూరు, జులై 17 ( విజయ క్రాంతి ) : ఏజెన్సీ ప్రాంతమైన పినపాక నియోజకవర్గంలో కొంద రు గిరిజనేతరులు గిరిజ నులను అడ్డం పెట్టుకొని కోట్లకు పడగ లెత్తారని, తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లెం కోటి ఆరోపించారు. గురువారం ఆ ఆ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ.. గిజనేతర పెద్దలు ఏజెన్సీ సహజ సంపదను, గిరిజ న భూములను, వ్యాపారా లను బినామీ పేర్లతో సృష్టించు కోని గిరిజన ప్రజలను బానిసలుగా మార్చుకొని నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.

వారి కబంధ హస్తాలతో దందాలకు తెగబ డుతున్నారని,అనేక కుట్ర లు చేస్తున్నారని, ఆ కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం ప్రతి ఆదివాసి బిడ్డపై ఉందన్నా రు.అ లాగే అటవీ, రెవెన్యూ భూము లను దోచుకొని బహుళ అంతస్తు లు నిర్మించి క్రయవిక్రయాలు చేసి కోట్ల రూపాయలకు పడుగు లెత్తా రని కోటి ధ్వజమెత్తారు.1/70యాక్ట్, పిఓటి, 77, అటవీ హక్కు ల చట్టాలను కాలరస్తు ఆదివాసి చట్టాలను ఉల్లంఘిస్తూ ఆదివా సులకు తీరని అన్యాయం చేస్తు న్నారని పేర్కొన్నారు.నియోజక వర్గంలో జరుగుతున్న టు వంటి అవినీతిపై మంత్రులకు, ఉప ముఖ్యమంత్రి కి ఫిర్యాదు అంద జేసి ప్రశ్నిస్తామని తెలిపారు.