మాజీ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య..!
- అప్పులబాధ తాళలేక మనస్థాపం
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ మాజీ సింగిల్ విండో చైర్మన్ క్రషర్ శ్రీనివాస్ రెడ్డి(62) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా వనపట్ల గ్రామానికి చెందిన క్రషర్ శ్రీనివాసరెడ్డి వనపట్ల సమీపంలో చాలకాలంగా క్రషర్ నడుపుతున్నాడు. ఆయా పార్టీలో చురుగ్గా పనిచేసిన ఆయన నాగర్ కర్నూల్ మండలం వైస్ ఎంపీపీగా, ప్రాథమిక సహకార సంఘంలో చైర్మన్ గా పని చేశారు.
బుధవారం ఉదయం క్రషర్ వద్ద ఉన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. వెంటనే పటంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించగా మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం జిల్లా జనరల్ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆయన మృతి పట్ల ఆయా పార్టీల నేతలు, అధికారులు జిల్లా వాసులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.




