పాఠశాల,అంగన్వాడీ కేంద్రంను సందర్శించిన సర్పంచ్, వైస్ చైర్మన్
18-03-2026 03:52 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండల కేంద్రములోని మండల ప్రజా పరిషత్ పాఠశాలను బుధవారం మఠంపల్లి గ్రామ సర్పంచ్ ఏసుమళ్ల వీర లక్ష్మి, హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆదూరి స్రవంతి సందర్శించి పాఠశాలలో మధ్యాహ్న భోజనమును, పాఠశాల పరిసరాలను, విద్యార్థుల సంఖ్యను, విద్యా ప్రమాణాలను పరిశీలించారు. అదేవిధంగా అంగన్వాడి కేంద్రం, భవిత కేంద్రమును సందర్శించి వారు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య,భోజనం అందించాలని, పాఠశాలలో పరిశుభ్రత పాటించాలని తెలియాజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కె.కిరీటం ఉపాధ్యాయులు,అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.




