15 April, 2026 | 4:48 PM

ప్రజల భాగస్వామ్యంతోనే కాలనీల అభివృద్ధి

14-04-2026 12:50 AM

జవహర్‌నగర్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): ప్రజలందరికీ భాగస్వామ్యంతోనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రగతిలో ప్రతి పనికి ప్రభుత్వంపై ఆధారపడకుండా ప్రజలందరి భాగస్వామ్యంతో సొంత నిధులతో అభివృద్ధి చెందవచ్చునని జవహర్ నగర్ మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ తెలిపారు.

మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ చంద్రపురి కాలనీలోని ముత్తుస్వామి కాలనీలో కాలనీవాసుల సహకారంతో సోమవారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ నిహారిక గౌడ్ తో కలిపి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ గొప్ప కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ నిహారిక రూ. 75000 ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకుడు వెంకటేష్, మహేందర్‌యాదవ్, భాస్కర్‌గౌడ్, అనిల్ ముదిరాజ్, కిషోర్, కిరణ్, రవి, కర్ణాకర్, వంశీ, విజయ్,రాజు పటాన్, రాము, భరత్,రాములమ్మ, యాదలక్ష్మి, నాగమణి, శకుంతల కాలనీవాసులు పాల్గొన్నారు.