రోడ్డెక్కిన కాలనీవాసులు
డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని ఆందోళన
మన్సూరాబాద్‌లో 12 కాలనీలకు చెందిన ప్రజల ఆందోళన
ఎల్బీనగర్ , జూన్ 7 : కాలనీలోకి వర్షపు నీరు బాక్స్ డ్రైన్ లో డ్రైనేజ్ నీరు,ఆటో నగర్ నుంచి వస్తున్న కెమికల్ వాటర్ తో కాలనీల రోడ్లపై డ్రైనేజ్ పారుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని 12 కాలనీల వాసులు ఆందోళనకు దిగారు. సమస్యను పరిష్కరించాలని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కనీస స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆదివారం శైలజపురి కాలనీలో వివిధ కాలనీల ప్రజలు రోడెక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీల్లో పారుతున్న డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, వర్షపు నీటి బాక్స్ డ్రైన్లో డ్రైనేజీ నీరు, కెమికల్ వ్యర్థ జలాలను కలపడం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ కాలనీల సంక్షేమ సంఘాల నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.






