8 June, 2026 | 2:45 AM

జలమండలి కార్మికుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత

08-06-2026 12:31 AM

తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు రాజిరెడ్డి

జలమండలి ఉద్యోగ, కార్మికుల భారీ విజయోత్సవ ర్యాలీ

ముషీరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): జలమండలి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఐఎన్టీయూసీ అనుబంధ తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ (టి.జె.ఈ.యు) జలమండలి ఉద్యోగ, కార్మికుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఐఎన్టీయూసీ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షుడు, తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు మొగుళ్ళ రాజిరెడ్డి తెలిపారు.

జలమండలి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టి.జె.ఈ.యు ఘన విజయం సాధించిన సందర్బంగా హైదరాబాద్  ఖైరతాబాద్  జలమండలి కేంద్ర కార్యాలయం నుండి గాంధీభవన్ వరకు వందలాది మంది జలమండలి ఉద్యోగ, కార్మికులు భారీ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ర్యాలీ ప్రారంభానికి ముందు జలమండలి గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన మొగుళ్ళ రాజిరెడ్డి మాట్లాడుతూ  కార్మికు లకు చట్టపరమైన హక్కులు, భద్రత, సరైన వేతనాలు,  మెరుగైన పని పరిస్థితులు కల్పించడనికి కృషి చేస్తానన్నారు.

ఈ ర్యాలీలో ఐఎన్టీయూసీ ఇంచార్జి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆర్.డి. చంద్రశేఖర్, వై. నాగన్న గౌడ్, టి.జె.ఈ.యు ప్రధాన కార్యదర్శి కె. రాఘవేంద్ర రాజ్, అసోసియేట్ ప్రెసిడెంట్ అల్లి శ్రావణ్ కుమార్, వాటర్ వరక్స్ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ అధ్యక్షులు కె.రాజి రెడ్డి, నేతలు  ఈ.చంద్రశేఖర్, ఎం.రాజా, బి.శంకర్ ప్రకాష్, బి.నర్సింగ్ రావు,కె.ఆనంద్ రెడ్డి, అజయ్ నాథ్,  వినోద్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, సైద్ హాసిం, ఇందూరి తిరుపతి, గౌస్ పాషా, బి.అశోక్, ఏ.అశోక్, మొగులయ్య, రవీందర్, లక్ష్మణ్ యాదవ్, ఆర్.వెంకటేష్, షేర్ బహదూర్, సాయిలు, శ్యామ్, అబ్దుల్ రవూఫ్, ప్రవీణ్ కుమార్, బి.మహేష్, వేణు, రంగయ్య, రాజేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.