28 June, 2026 | 12:22 PM

Breaking News

పోలియో రహిత సమాజ నిర్మాణం అందరి బాధ్యత   •   పసిపిల్లల ఆరోగ్యానికి ఆ రెండు చుక్కలే రక్ష   •   సీసీ కెమెరాలతో గ్రామంలో పటిష్టమైన భద్రత   •   రోజువారి కూలీల జేబుకు చిల్లు పెడుతున్న మద్యం మాఫియా   •   రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి   •  

రంగుల తాడు

28-07-2025 12:00 AM

ఎవరు పిలిచారో ?

మేఘాన్ని

ఉన్నపళంగా వెళ్లిపోయింది !

మనసులో మాటలు 

ఇంకా మిగిలే ఉన్నాయి

తనివి తీరని తలపులెన్నో

తలుపు చాటునే పొంచాయి 

కదలిపోతున్న మేఘాన్ని

కదలకుండా చూస్తూ 

నేలపై శిలలా

ఒంటరిగా నేను  !

నా గుండె శబ్దం 

ఏ విహంగానికి వినిపించిందో?

ముందుకెళ్లిన మేఘం 

క్షణాల్లో నా ముందుకొచ్చింది 

నన్నే చూస్తూ నిలుచుంది 

మనసు మురిసి 

మాటల ముడి విప్పి 

పూర్తిగా వినిపించా !

చినుకులు 

నా చిన్ననాటి స్నేహితులు

చిందులేయాలన్నది 

నా చిరకాల కోరిక 

ముద్దగా తడిసి 

మనసు ముసురంతా 

చెరిగిపోయింది 

జల్లులు కురిసి 

మేఘం కూడా తేటతెల్లమైంది 

ఆలస్యం చేయక 

రంగుల తాడు విసిరి 

చూపును కట్టేసింది హరివిల్లు