13 May, 2026 | 4:43 PM

Breaking News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •   విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్   •  

కెనడాలో కాంబాటింగ్ హేట్ చట్టానికి ఆమోదం

27-03-2026 12:00 AM

ఖలిస్థానీల ఆగడాలకు చెక్!

కెనడా, మార్చి 26: విద్వేశపూరిత చర్య లు, నేరాలను అరికట్టేందుకు తీసుకువచ్చిన ‘కాంబాటింగ్ హేట్’ (విద్వేశ నిరోధక చట్టం -బిల్ సి-9)ను కెనడా పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టానికి కన్జర్వేటివ్‌లు, ఎన్డీపీ వ్యతిరేకంగా ఓటు వేసి అడ్డుకోవాలని ప్రయత్నించినా బ్లాక్ క్యూబెకోయిస్ మద్దతుతో ఆమోదం పొందింది. అనంతరం సెనెట్‌కు వెళ్లింది. కెనడాలో భారతీయులు, మందిరాలపై దాడుల నేపథ్యంలో అనేక సంవత్సరా లుగా ఈ చట్టం కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ చట్టంతో ఖలిస్థానీల దాడులకు చెక్ పడుతుందని భావిస్తున్నారు. చట్టం ప్రకారం విద్వేష చిహ్నాలను బహిరంగంగా ప్రదర్శించడం నేరంగా పరిగణిస్తారు. గురుద్వారాలు, దేవాలయాలు, పాఠశాలలు, మతపరమైన సంస్థ, బహిరంగ ప్రదేశాలలో నిరసనలు, ఆందోళనలు చేపడుతున్న వారిపై ఈ చట్టాన్ని ప్రయోగించనున్నారు.

కెనడాలో ఉగ్రవాద సంస్థలుగా ముద్రపడ్డ జబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ), ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్ (ఐఎస్‌వైఎఫ్)వంటి వాటి ఆగడాలకు అడ్డుకట్టవేసినట్లయ్యింది. కెనడా తీవ్రవాద శక్తులకు స్వర్గధామంలా మారిందని పదే పదే ఆందోళన వ్యక్తం చేయడం, ఒత్తిడి తేవడంతో ఎట్టకేలకు ఈ చట్టాన్ని తీసుకురాక తప్పలేదు.