1 August, 2026 | 5:50 PM

Breaking News

వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి   •   అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి   •   నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం   •   ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం   •   ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి   •   రిఫీలింగ్ సెంటర్లపై దాడి.. 16 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం   •   అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలి   •   విద్యార్థులకు అండగా నిలబడడమే 'యూత్ ఫర్ సేవ' లక్ష్యం   •   కోనరావుపేట మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల ఏర్పాటు   •  

రాగిన్ పెద్ద హీరో అవుతాడు

14-02-2025 12:00 AM

దీపా ఆర్ట్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ గౌడ్ నిర్మాతగా అమ్మ రాజశేఖర్ దర్శక త్వం వహించిన సినిమా ’తల’. ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయ మవుతున్నాడు. అంకిత నస్కర్ హీరో యిన్. రోహిత్, ఎస్తేర్ నోరన్హా, ముక్కు అవినా ష్, సత్యం రాజేశ్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ కీలక పాత్రల్లో నటిం చారు.

ఈ సినిమా ఈ 14న విడుదల కాబోతోంది. తాజా గా టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున ఈ మూవీ ఫస్ట్ టికెట్‌ను కొనుగోలు చేశారు. ఈ సంద ర్భంగా ఆయన ఈ మూవీ ట్రైలర్ ను చూసి చిత్రబృందాన్ని అభినందించా రు. ‘రాగిన్ పెద్ద హీరో అవుతాడు. అమ్మ రాజశేఖర్ డైరెక్షన్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధించాలని ఆకాక్షిస్తున్నా ను’ అని పేర్కొన్నారు. ‘నాగార్జున తల మూవీ ఫస్ట్ టికెట్‌ను కొనడం ఈ సినిమా సాధించబోతున్న పెద్ద విజ యానికి చిహ్నం’ అని దర్శకుడు అమ్మ రాజశేఖర్ అన్నారు. ఈ చిత్రానికి సిని మాటోగ్రఫీ: శ్యామ్ కే నాయుడు; సంగీతం: ధర్మతేజ.