28 February, 2026 | 12:48 PM

తెప్పోత్సవానికి తరలిరండి

09-08-2024 12:05 AM

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): ఈ నెల 18న నిర్వహించనున్న గంగతెప్పోత్సవ శోభాయాత్రకు గంగపుత్ర కుల బంధువులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కోరారు. ఈ మేరకు గురువారం తెలంగాణ గంగతెప్పోత్సవ కమిటీ ఆధ్వర్యంలో శోభాయాత్రకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆవిష్కరించారు. తెలంగాణ గంగతెప్పోత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి బిజ్జ కనకేష్ కుమార్ మాట్లాడుతూ..శోభాయాత్ర ఖైరతాబాద్‌లోని ఏడుగుళ్ల దేవాలయం నుంచి ఊరేగింపు ప్రారం భమై హుస్సేన్‌సాగర్ వరకు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంఘం నాయకులు నర్సింహ, రాజు, బాబురావు, రాములు, శేఖర్, కనకమ్మ, కుమార్ పాల్గొన్నారు.