తెలుగు మహా సభలకు రండి
ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించిన ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్
హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): ఏపీలోని గుంటూరు అమరావతి శ్రీ సత్య సాయి స్పిరచువల్ సిటీ ప్రాంగణం (హైవే)లో నందమూరి తారకరామారావు వేదికపై ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 2026 జనవరి 3 నుంచి 5వ తేదీవరకు 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నారు.
జనవరి 3న నిర్వహించే ప్రారంభోత్సవ సభకు సతీ సమేతంగా రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ముఖ్యమంత్రి కార్యాలయంలో శనివారం ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు డా గజల్ శ్రీనివాస్ కలసి ఆహ్వానించారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారని, మాతృ భాషా వికాసం కోసం ప్రజలందరూ కలసి కట్టుగా పని చేయాలని అన్నారని తెలుగు మహా సభల ముఖ్య సమన్వయ కర్తలు పి రామచంద్రరాజు, వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు.






