calender_icon.png 23 November, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికవర్ వైద్యుల అరుదైన ఘనత

23-11-2025 12:00:00 AM

కస్టమ్-మేడ్ 3డీ ఇంప్లాంట్‌తో దవడ ఫంక్షన్ పునరుద్ధరణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 22 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్, క్లిష్టమైన టెంపరో-మెండిబులర్ జాయింట్ (టీఎంజే) అంకై లోసిస్’ కేసును అత్యాధునిక 3డీ ప్రింటింగ్ సాంకేతికత, వ్యక్తిగతీకరించిన శస్త్రచికిత్సా ప్రణాళికతో విజయవంతంగా నిర్వహించారు. నాలుగు సంవత్సరాలుగా నోరు తెరవలేక, ఆహారం తీసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సూడాన్‌కు చెందిన 23 ఏళ్ల యువకుడు మహమ్మద్ అహ్మద్ అలీ..

ఈ శస్త్రచికిత్స అనంతరం తిరిగి సాధారణ దవడ కదలికను పునరుద్ధరించుకోగలిగాడు. ’టీఎంజే అంకైలోసిస్’ అనేది దవడ ఎముక (మాండిబుల్) తల ఎముక (స్కల్ బేస్)తో పూర్తిగా అతుక్కుపోయే (ఎముకల కలయిక) అరుదైన పరిస్థితి. దీనివల్ల దవడ కీలు చలనం పూర్తిగా నిలిచిపోయి, రోగి నోరు తెరవడం, మాట్లాడటం, తినడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మెడికవర్ హాస్పిట ల్స్, హైటెక్ సిటీ, డెంటిస్ట్రీ, మెక్సిలోఫేషియల్ సర్జరీ విభాగం సీనియర్ కన్స ల్టెంట్, హెడ్ డా. శరత్ బాబు సి, సీనియర్ మెక్సిలోఫేషియల్ సర్జన్ డా. నవీన్ కొక్కుల నాయకత్వంలోని నిపుణుల వైద్య బృందం రోగి ముఖ నిర్మాణం, శరీర నిర్మాణ శాస్త్రానికి అత్యంత కచ్చితంగా సరిపోయే విధంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన (కస్టమ్-మేడ్) 3డీ ప్రింటెడ్ టీఎంజే ప్రోస్థసిస్ను .

ఉపయోగించింది ఫ్యూజ్ అయిన దవడ కీలును తొలగించి, దాని స్థానంలో ఈ ఆధునిక 3డీ ఇంప్లాంట్‌తో పూర్తి దవడ కీలు మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతం గా పూర్తి చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ‘అతుక్కుపోయిన కీలును సున్నితంగా వేరు చేసి, రోగి సహజ దవడ కదలికలను అనుకరించేలా ఈ కస్టమ్ ఇంప్లాంట్‌ను జాగ్రత్తగా అమర్చామని తెలిపారు.