డ్రైనేజీ పైప్‌లైన్ పనుల ప్రారంభం
ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి
కుషాయిగూడ మార్చి 13 విజయక్రాంతి) : ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చర్లపల్లి డివిజన్ పరిధి లోని చర్లపల్లి గ్రామంలో బంగారు మైసమ్మ గుడి సమీపంలో 13 లక్షల నిధులతో చేపట్టనున్న డ్రైనేజీ పైప్లైన్ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాం త ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపరచడం లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతు న్నట్లు తెలిపారు. కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేం దుకు ఈ పనులు ప్రారంభించామని పేర్కొన్నారు.
పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక ప్రజలు, నాయకులు అభివృద్ధి పనులు ప్రారంభించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు నేమూరి మహేష్ గౌడ్, డి. గిరి బాబు, కె. యాదగిరి, బి. నర్సింహా, కె. నర్సింహా, ఎం. నర్సింహా, డి. లక్ష్మయ్య, కె. ఇంద్ర, కె. ఎల్లమ్మ, కె. ఆనంద్ రాజ్, ఈ. నర్సింహా, కె. కుమార్, కె. సురేష్, కె. రమేష్, కె. నాగేష్, కె. అనిల్ కుమార్, పి. శ్రీను, టి. కృష్ణ, టి. సురేష్, డి. రాములు, డి. బాలకృష్ణ, డి. భాను, ఎం. అరుణ్, కోటి రెడ్డి, బాలరాజ్, లోకనాథ్, రాము, కె. ఎల్లం, కె. మహేందర్, ఎ. నాగరాజ్, కె. శివ, ఎ. కిరణ్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.




