6 May, 2026 | 3:58 AM

వాణిజ్య పంటలను విస్తరించాలి

06-05-2026 02:12 AM

ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

ములకలపల్లి,మే 5 (విజయక్రాంతి): సాంప్రదాయ పంటలతో పాటు రైతులు ఉద్యాన, ఆయిల్ ఫామ్ వంటి వాణిజ్య పంటలను అధిక విస్తీర్ణంలో సాగు చేయడం ద్వారా ఈ పంటల విస్తరణకు కృషి చేయాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కోరారు.

మంగళవారం ములకలపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమంలో రెండవ రోజు ఉద్యాన పంటల సాగుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదినారాయణ మాట్లాడుతూ ఉద్యాన, ఆయిల్ ఫామ్ పంటలను సాగు చేసి రైతులు ఆర్థికంగా ఎదగాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేట నియోజకవర్గం ఉద్యాన పంటలకు, ఆయిల్ ఫామ్ సాగుకు పెట్టింది పేరని అనుకూలమైనటువంటి నేల స్వభావం ఉన్నందున రైతులు ఈ పంటలను విస్తరించాలని చెప్పారు.కార్యక్రమంలో ఏర్పాటుచేసిన డ్రిప్ ఇరిగేషన్, ఆటోమేషన్, ఆయిల్ ఫామ్ స్థాలను ఆయన పరిశీలించారు. ఆయా స్టాళ్లల్లో ప్రదర్శించిన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పద్ధతులను అడిగి తెలుసుకున్నారు.

ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంపు, పంటల మార్పు, ప్రత్యామ్నాయ పంటల సాగు అంశాలపై ఆయిల్ ఫామ్ సాగు వలనలాభాలు, సాగు పద్ధతులు,మార్కెట్ అవకాశాలపై నిపుణులు రైతులకు విస్తృత అవగాహన కల్పించారు. అశ్వారావుపేట ఆత్మ కమిటీ చైర్మన్ వీరభద్రరావు, జాయింట్ డైరెక్టర్ బాబు, ఏడిఏ రవికుమార్, టీజీ ఆయిల్ ఫేడ్ డివిజనల్ అధికారి, అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు డాక్టర్ నీలిమ,డాక్టర్ ఝాన్సీ, ఉద్యాన అధికారి, వ్యవసాయ అధికారులు, ఏ ఈ ఓ లు, సర్పంచులు, హెచ్ ఇ వో లు,రైతులు పాల్గొన్నారు.