6 May, 2026 | 4:00 AM

రామనామం విలువ కాంగ్రెస్‌కు తెలియదు

06-05-2026 02:12 AM
  1. భక్తిని పైసలతో కొలిచే నీచమైన సంస్కృతి హస్తానిది
  2. బీజేపీ ముఖ్యఅధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్

హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): జై శ్రీరామ్ అంటే పైసలు పడతాయా అని అడుగుతున్నారు, భక్తిని కూడా పైసలతో కొలిచే నీచమైన సంస్కృతి కాంగ్రెస్ ది’ అని బీజేపీ ముఖ్యఅధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్ మండిపడ్డారు. మీ ఢిల్లీబాసులు ఇటలీ సంస్కృతిలో పెరిగారు కాబట్టి కాం గ్రెస్ నాయకులకు రామనామం విలువ తెలియదని విమర్శించారు.

తెలంగాణ మంత్రి కొండా సురేఖ బీజేపీ నాయకులపై, కేంద్రమంత్రులపై, ప్రధాని నరేంద్రమోదీ పర్యటనపై చేసి న వ్యాఖ్యలు చూస్తుంటే ఆమె అజ్ఞానానికి ఆకాశమే హద్దనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు మం గళవారం ఎన్‌వీ సుభాష్ ఒక ప్రకటనను విడుదల చేశారు. మోదీ ప్రభుత్వంపై అబద్దపు ప్రచారాలు చేస్తున్న మంత్రి సురేఖ మీ కళ్ళజోడు మార్చుకొని మీ సొంత జి ల్లా ఉమ్మడి వరంగల్‌లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడాలని హితవు పలికారు.

కాజీ పేట రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్, పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్క్ ప్రాజెక్టు, మాము నూరు ఎయిర్ పోర్టు నిర్మా ణం, రామప్ప ఆలయానికి యునెస్కో జాబితాలో చేర్చిందెవరని నిలదీశారు. ఇలా కేంద్రం అనేక కార్యక్రమా లను చేపట్టిందన్నారు. మే 10వ తేదీన ప్రధాని ప్రారంభించబోయే రూ. 7,823 కోట్ల విలువైన ప్రాజెక్టులే కేంద్రమంత్రుల పనితీరుకు నిదర్శనమన్నారు.