ఈస్ట్ హైదరాబాద్‌పై స్పెషల్ ఫోకస్
- ఈ ప్రాంతంలో పరిశ్రమలు విస్తరిస్తాం
- నిర్మాణ రంగానికి అండగా ఉంటాం
- క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 23 (విజయక్రాంతి): ఈస్ట్ హైద రాబాద్‌పై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. నగరం నలుదిక్కులను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టంచేశారు. నిర్మాణ రంగానికి అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు. పట్టణీకరణలో నిర్మా ణ రంగానిది కీలక పాత్ర అని చెప్పారు.
శుక్రవారం కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ఆధ్వర్యంలో క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ఉప్పల్ భగాయత్ శిల్పారా మం సమీపంలోని నాగోల్ మెట్రో స్టేషన్‌లో నిర్వహించారు. ఈ నెల 25వ వరకు జరుగనున్న ఈ ప్రాపర్టీ షోను మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం మాట ఇస్తే కట్టుబడి ఉంటు ందని స్పష్టంచేశారు. రియల్ ఎస్టేట్ రంగానికి అండగా ఉంటామని వెల్లడించారు.
నిర్మాణ రంగానికి పయోగపడేవిధంగా స్కిల్ యూనివర్సిటీ ద్వారా సమీప భవిష్యత్‌లో నైపుణ్యం కలిగిన నిపుణులు అందుబాటులోకి వస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. మౌలిక వసతుల కల్పన, పన్నుల మినహాయింపు అంశాలపై త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజారవాణాను మెరుగు పర్చాలనే లక్ష్యంతో రవాణా రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, ఔటర్ రింగు రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
పారిశ్రామిక రంగానికి పెద్దపీట
ఐటీతోపాటు పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఈస్ట్ హైదరాబాద్‌లో ఐటీ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని చెప్పారు. సీఎంతో చర్చించి ఐటీ కోసం ఓ కన్వెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అభివృద్దికి దోహదం చేసే అన్ని రంగాలకు తోడ్పాటు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. 15 వేల ఎకరాల విస్తీర్ణంలో కొత్త నగరం నిర్మాణం చేపట్టబోతున్నామని చెప్పారు.
కొనుగోలు శక్తిని పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, పేద, మధ్య తరగతి ప్రజలకు స్వంత ఇల్లు ఉన్నప్పుడే స్థిరపడినట్టు ప్రజలు భావిస్తారని తెలిపారు. రాజకీయాలకు అతీ తంగా తమ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుందన్నారు. కార్యక్రమంలో ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పీర్జాదిగూడ కార్పొరేషన్ మాజీ మేయర్, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అడ్వైజర్ జక్కా వెంకట్‌రెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, ఎలెక్టెడ్ అధ్యక్షుడు జైదీప్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జగన్నాథ్‌రావు, వైస్ ప్రెసిడెంట్స్ మురళీ, శ్రీకాంత్, రాంబాబు, కోశాధికారి మనోజ్ అగర్వాల్, జాయింట్ సెక్రటరీ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.






