calender_icon.png 15 October, 2025 | 8:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచినీటి సరఫరాను పరిశీలించిన కమిషనర్ రమేష్

15-10-2025 06:09:30 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): మున్సిపల్ కొళాయిల ద్వారా సరఫరా అవుతున్న మంచినీరును మున్సిపల్ కమిషనర్ తిప్పరాజు రమేష్ పరిశీలించారు. గత వారం రోజులుగా మంచినీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురుకావడంతో వాటిని అధిగమించి మానేరు వాగులో బావిని పరిశీలించిన అనంతరం బాగుపరచిన మోటార్లను బావిలోకి దింపి మున్సిపల్ పరిధిలోని ప్రజలకు మానేరు వాగు త్రాగునీరు యధావిధిగా సప్లై చేపట్టడంతో బుధవారం నల్లాల ద్వారా ఇంటింటికి సరఫరా అవుతున్న నీరును పరిశీలించారు.

వాటర్ ట్యాంకులను బావిని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ స్వచ్ఛమైన తాగునీరును ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నామని బ్లీచింగ్ పౌడర్ కల్పిన నీరును సరఫరా చేపడుతున్నామని తెలిపారు. ఇంటికి 45 నిమిషాల చొప్పున నీటిని అందించడం జరుగుతుందని ప్రతి ఒక్కరు కొళాయి ద్వారా వచ్చే నీళ్లను పొదుపుగా వినియోగించుకోవాలని, త్రాగునీరు అవసరాలకు వాడుకోవాలని సూచించారు. మంచినీటి సరఫరాలో ఇబ్బందులు ఏవైనా ఎదురవుతే సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. కమిషనర్ వెంట వాటర్ సప్లై సిబ్బందితోపాటు పలువురు పాల్గొన్నారు.